చీతాలకు రక్షణగా గజరాజులు

© ANI Photo

ఇటీవల కునో జాతీయ పార్కులో వదిలిన చీతాలకు రక్షణగా రెండు ఏనుగులు కాపలా కాస్తున్నాయి. చీతాల రక్షణ కోసం ప్రత్యేకంగా నర్మాదాపురం సాత్పురా టైగర్ రిజర్వ్ నుంచి లక్ష్మి, సిద్ధాంత్ అనే రెండు గజరాజులను ఇక్కడికి తీసుకువచ్చారు. గస్తీ విధుల్లో ఈ రెండు ఏనుగులకు సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం ఎనక్లోజర్‌లలో ఉన్న చీతాలను ఇవి పర్యవేక్షిస్తున్నాయి. కాగా దాదాపు 74 ఏళ్ల తర్వాత 8 చీతాలు భారత్‌లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

Exit mobile version