ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక గ్యాలరీ శనివారం రాత్రి కుప్పకూలింది. దీంతో 200 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన కేరళలోని పూంగోడ్లోని ఎల్పి స్కూల్ గ్రౌండ్లో చోటుచేసుకుంది. ఫ్లడ్లైట్స్ పలువురిపై పడగా, వారు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. గ్యాలరీకి అవతలి వైపు ఉన్న వ్యక్తులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆలిండియా సెవెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా ఈ ప్రమాదం జరిగింది.