గ్యాంగ్ రేప్: ‘ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లే ప్రేరణ !’

© Envato

అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. ‘మే 28న తాము పబ్‌కి వెళ్ళినపుడు బాధిత బాలిక, మరో బాలికతో పరిచయం పెంచుకున్నాం, వారు అమాయకత్వంతో కనిపించడంతో ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే బాలికను నమ్మించి, అందరం కలిసి పన్నాగం పన్ని అత్యాచారం చేశాం. మేము ఇదంతా చేయడానికి ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లే ప్రేరణ’ అంటూ నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. నిందితుల నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version