ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. ఘోసి గ్రామానికి చెందిన 13 ఏండ్ల బాలిక శుక్రవారం ఉదయం చెత్త పడేసేందుకు బయటకు వెళ్లింది. ఈక్రమంలో బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను వ్యవసాయ బావిలో తోసేసి వెళ్లారు. బాలికను చూసిన వ్యవసాయ కూలీలు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆమెను వారు రక్షించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.