8 మంది మోడ‌ల్స్‌పై గ్యాంగ్ రేప్‌..దారుణ ఘ‌ట‌న‌

© Envato

ద‌క్షిణాఫ్రికాలో దారుణం చోటుచేసుకుంది. 8 మంది మోడ‌ల్స్‌పై గ్యాంగ్ రేప్ జ‌రిగింది. దక్షిణాఫ్రికాలోని క్రూగెర్స్‌డార్ప్ అనే ప‌ట్ట‌ణంలో జరుగుతున్న ఒక మ్యూజిక్ షూట్‌ కోసం 8 మంది మోడ‌ల్స్ వెళ్లారు. అయితే అక్క‌డ సెట్ వేసే సిబ్బంది అమ్మాయిల‌ను ఆయుధాల‌తో బెదిరించి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఒకే అమ్మాయిని 10 మంది, మ‌రో అమ్మాయిని 8 మంది రేప్ చేశారు . ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇందులో మొత్తం 20 మంది నిందితులు ఉండ‌గా పోలీసులు ముగ్గురుని ప‌ట్టుకున్నారు, మిగ‌తావారికోసం గాలిస్తున్నారు. దీనిపై స్పందించిన ద‌క్షిణాఫ్రికా అధ్య‌క్షుడు సిరిల్ ర‌మ‌ఫోస నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ఆదేశించారు.

Exit mobile version