LPG యూజర్లకు మరో షాక్ తగిలింది. నేటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద రూ. 105ను పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ఫిబ్రవరి 1న ఆయిల్ కంపెనీలు LPG సిలిండర్ ధరను రూ. 91.50 మేర పెంచాయి. ప్రస్తుత పెంపుతో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2012కు చేరుకుంది. డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం పెరగలేదు. దీంతో డొమెస్టిక్ వినియోగదాలు ఊపిరి పీల్చుకున్నారు.