అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో గల బ్రాండిక్స్ అపెరల్ ఇండియా సిటీలో నుంచి అమ్మోనియా గ్యాస్ లీకైంది. అందులో పని చేస్తున్న సుమారు 190 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను కంపెనీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. మరి కొందరు అనకాపల్లి, అచ్యుతాపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ ఎలా లీకైంది, ప్రమాదం ఎక్కడ జరిగింది అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.