ఆసియాలోనే అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ మరో భారీ ప్రకటన చేశారు. రాజస్థాన్‌లోని రెండు జిల్లాల్లో మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మించబోతున్నట్లు తెలిపారు. అలాగే ఉదయ్‌పూర్‌లో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ.65000కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు గౌతమ్ అదానీ తెలిపారు. వ్యాపారంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న అదానీ ఇటీవలో అంబానీని సైతం వెనక్కి నెట్టి అత్యంత సంపన్నుడిగా అవతరించారు.