ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు శాసనకర్తల్లో ఒకరు మహిళేనని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యయనం పేర్కొంది. చరిత్రలో తొలిసారిగా ప్రతి దేశ పార్లమెంట్‌లో కనీసం ఒక్క మహిళ అయినా సభ్యురాలిగా ఉన్నారని తెలిపింది. 2011లో ప్రతి ఐదుగురు చట్టసభల సభ్యుల్లో ఒకరు మహిళ ఉండేవారని, ఈ దశాబ్ద కాలంలో అది మెరుగైందని తెలిపింది. ప్రస్తుత పురోగతి రేటుతో లింగ సమానత్వం స్థాయికి చేరుకోవడానికి 80 ఏండ్లు పడుతుందని అంచనా వేసింది. కేవలం ఆరు దేశాల్లోని చట్టసభల్లో సగం మంది మహిళలు ఉన్నారని తెలిపింది.