ప్రముఖ దర్శకుడు శంకర్, స్టార్ హీరో అర్జున్ కాంబినేషన్లో సుమారు 29 సంవత్సరాల క్రితం వచ్చిన మూవీ ‘జెంటిల్ మ్యాన్’. అప్పట్లో ఈ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే ఈ సినిమాను నటించిన కే.టీ కుంజుమోన్ ‘జెంటిల్ మ్యాన్ 2’ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి M.M.కీరవాణి మ్యూజిక్ అందిస్తారని, నయనతార చక్రవర్తి, ప్రియాలాల్ హీరోయిన్లుగా నటిస్తారని ఆయన వెల్లడించారు. తాజాగా ఈ మూవీని ఏ.గోకుల్ కృష్ణ డైరెక్ట్ చేస్తాడని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కాగా గతంలో గోకుల్ నాని ‘ఆహా కళ్యాణం’ మూవీని డైరెక్ట్ చేశాడు. అయితే ఈసినిమాలో హీరో ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.