ఫిఫా ప్రపంచకప్లో ఖతార్ ఆతిథ్యంపై ఆయా జట్ల నుంచి నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా జర్మనీ జట్టు ఈ జాబితాలో చేరింది. మ్యాచ్కు ముందు దిగిన ఫొటోలో.. నోరు మూసుకున్నట్లుగా సంకేతాలిస్తూ ఆటగాళ్లు పోజులిచ్చారు. ఖతార్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని ఏడు ఐరోపా జట్లు నిర్ణయించాయి. స్వలింగ సంపర్కులకు మద్దతుగా ‘వన్ లవ్’ ఆర్మ్బ్యాండ్లు ధరించాలని నిశ్చయానికొచ్చాయి. కానీ, ఇలా చేస్తే కఠిన చర్యలుంటాయని ఫిఫా హెచ్చరించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనికి నిరసనగా ఇలా ఫొటో దిగారు. కాగా, జర్మనీ నాలుగు సార్లు వరల్డ్ కప్ సాధించింది.
నోరు మూసుకున్న జర్మనీ ఆటగాళ్లు..!

Courtesy Twitter:@Football__Tweet