తమిళనాడు గవర్నర్ RN రవిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తమిళనాడును వదిలి వెళ్లిపోవాలంటూ #GetOutRavi ట్రెండ్ చేస్తున్నారు. ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ స్పీచ్ రచ్చకు కారణమైంది. ప్రభుత్వం అందించిన స్పీచ్‌లో RN రవి కొన్ని భాగాలు చదవకుండా వదిలేశారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్‌ను మాత్రమే రికార్డులలో ఉంచాలని సీఎం స్టాలిన్ రిజల్యూషన్ తీసుకొచ్చారు. దీంతో జాతీయగీతం కూడా ఆలపించకముందే గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు. సభ నుంచి తమిళనాడు నుంచే వెళ్లిపోండి అంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.