‘ఆర్ఆర్ఆర్’ మూవీ మార్చి 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే RRR షో రన్ అవుతుండగా బ్రేక్‌లో ‘గని’ మూవీ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారట. మొత్తం 1000 థియేటర్లలో ఆర్ఆర్ఆర్తో పాటు ఈ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని మూవీ ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సునీల్ శెట్టి, ఉపేంద్ర వంటి ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలో నటించారు. సాయీ మంజేర్కర్ హీరోయిన్గా నటించింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. తమన్ మ్యూజిక్ అందించాడు.