GHMCకి చెందిన 47 మంది బీజేపీ కార్పొరేటర్లకు ఢిల్లీ నుంచి పిలుపు అందింది. వీరితో పాటుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేతలు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. కార్పొరేటర్లతో మోదీ అరగంట పాటు సమావేశం కానున్నారు. వారికి రేపు సాయంత్రం మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారు. కార్పొరేటర్లు, సీనియర్ నేతలతో పాటుగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జిల్లాల పార్టీ అధ్యక్షులు కూడా మోదీని కలవనున్నారు.