న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన గిల్ ఓ అద్భుత రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా ఘనత సాధించాడు. కేవలం 19 ఇన్నింగ్స్‌లో గిల్ 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ 24 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్ సాధించారు. ప్రపంచ క్రికెట్లో 18 ఇన్నింగ్స్‌తో ఫకర్ జమాన్ ముందు వరుసలో ఉన్నాడు. రెండో స్థానంలో ఇమామ్ఉల్ హక్, శుభ్‌మన్ గిల్ ఉన్నారు. మూడో స్థానంలో 21 ఇన్నింగ్స్‌తో వివ్ రిచర్డ్స్, కెవిన్ పీటర్సన్ , జొనథన్ ట్రాట్, డీ కాక్, బాబర్ అజాం, రస్సీ వాన్‌డర్ డుస్సెన్ ఉన్నారు.