శుభమన్ గిల్ విషయంలో తనకు బాధ కలుగుతోందని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నారు. రోహిత్, ధావన్ తర్వాత స్థానంలో ఓపెనర్ గా కనిపించిన గిల్…ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ తో 4వ స్థానానికి పడిపోయాడని పేర్కొన్నారు. అతడి తప్పేమి లేకపోయినా గిల్ కు జట్టులో స్థానం దక్కకపోవటం బాధాకరమని తెలిపారు. ధావన్ ఫామ్ గురించి మాట్లాడని జాఫర్…న్యూజిలాండ్ తో లభించిన అవకాశాన్ని వినియోగించుకున్నట్లు వెల్లడించారు. మెుదటి నాలుగు స్థానాలపై సందిగ్ధత నెలకొందన్నారు.