హైదరాబాద్ లో పబ్‌ల వల్ల జరుగుతున్న అరాచకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల అమ్నీషియా పబ్‌లో బాలిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అది మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని రూఫ్ టాప్ పబ్ లో 8 మంది యువకులు ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డారు. రేప్ చేస్తామంటూ బెదిరిస్తూ బాటిళ్లతో దాడి చేశారు. అడ్డువచ్చిన వారిపైనా నిందితులు దాడి చేసినట్లు బాధితురాలు పేర్కొంది. పబ్ సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులోనూ నిందితులు బడా బాబుల కుమారులేనని తెలుస్తోంది.