జూబ్లీహిల్స్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో ఆమె పేరు బయటపెట్టిన వీడియోలపై సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో పలు యూట్యూబర్‌లపై రెండు కేసులు నమోదు చేశారు. యూట్యూబర్‌లు వీడియోలు అప్‌లోడ్ చేసిన తర్వాత పోలీసులు వాటిని సుమోటోగా తీసుకున్నారు. మరోవైపు డిబేట్ షోలల్లో కూడా వీడియోలు పదేపదే ప్లే చేయబడ్డాయని, అవి పోక్సో చట్టాన్ని ఉల్లంఘించడమేనని పోలీస్ అధికారులు తెలిపారు. మరోవైపు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయిన వీడియో క్లిప్ లీక్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.