• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అగ్గువకే అమ్మాయిలు, విదేశీ మద్యం

    డిసెంబర్‌ 31 వచ్చేస్తోంది. కుర్రాళ్లు మందు, చిందు అంటూ గట్టిగానే ప్లాన్స్ వేసుకుంటారు. కానీ ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు కూడా సన్నద్ధమవుతుంటారని సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. 31st పార్టీల పేరిట తక్కువ ధరకే మద్యం, అందమైన అమ్మాయిలు అంటూ సందేశాలు పంపుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి లింక్‌లపై క్లిక్‌ చేసినా, వారి సందేశాలకు స్పందించినా తర్వాత చింతించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంటికే మద్యం డెలివరీ, అమ్మాయిలు, పార్టీలు, డీజేలు అని ఏ మెసేజ్‌ లింక్‌ వచ్చినా ఓపెన్‌ చేయొద్దని అప్రమత్తం చేస్తున్నారు.