వివాహ పరిచయ వేదిక ద్వారా అమ్మాయి పరిచయమవుతుంది. వాట్సాప్లో చాట్ చేస్తుంది. కాఫీ క్లబ్లు, పార్కుల్లో పెళ్లి చూపులు ఉంటాయి. అప్పడప్పుడూ షికార్లు, బహుమతులు, పాకెట్ మనీ, అవసరాలు అంటూ అబ్బాయికి తడిసి మోపెడవుతుంది. కానీ చివరికి ఆ అమ్మాయి మన ఇద్దరికి సెట్ అవ్వదంటూ బ్రేకప్ చెప్పేస్తుంది. గట్టిగా నిలదీస్తే లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తుంది. ఇదంతా నయా సైబర్ దందా.ఈడు దాటిపోతున్నా ఇంకా పెళ్లికాని, అయినా విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి సైబర్ నేరగాళ్లు వలపన్ని నకిలీ వివాహ వేదికలతో బురిడీ కొట్టిస్తున్నారు.
ఫ్రీగా అమ్మాయిల నంబర్లు..పార్కుల్లో ముచ్చట్లు!

© Envato