మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2022 సమరం మొదలు కాబోతోంది. జట్లన్నీ బరిలోకి దిగడానికి సిద్దంగా ఉన్నాయి. మరోవైపు ఆర్సీబీ ఈసారైనా కప్పు కొట్టాలనే ఆశతో ఉంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్ నుంచే ఆర్సీబీ కెప్టెన్గా తప్పకున్న విరాట్ పై ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేదని.. దీంతో కోహ్లి రిలాక్స్ గా బరిలోకి దిగుతాడని అన్నాడు. కెప్టెన్సీ ప్రభావంతో ఇప్పటివరకు స్వేచ్ఛగా ఆడలేకపోయిన విరాట్ తో ప్రస్తుతం ప్రత్యర్థి జట్లు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాడు. కాగా, 2013లో ఆర్సీబీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన విరాట్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా జట్టుకు ట్రోఫీని అందించలేకపోయాడు. ఇక, ఆర్సీబీ మార్చి 27న తన మొదటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఢీకొట్టనుంది.