దీపావళి బరిలో నిలిచిన విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’, శివకార్తికేయన్ ‘ప్రిన్స్’, మంచు విష్ణు ‘జిన్నా’, సినిమాలపై YOUSAY APP ఓ పోల్ నిర్వహించింది. ‘ఈ దీపావళికి మీరు వెళ్లే సినిమా ఏది?’ అని ప్రశ్నించింది. దీనికి 45% మంది ఓటీటీలో ఏదోక సినిమా చూస్తాం అని చెప్పగా..28% ప్రిన్స్ సినిమా చూస్తామని, 19% మంది ఓరి దేవుడా మూవీకి, 8% జిన్నా సినిమాకు వెళ్తామని ఓటు వేశారు. ఈ పోల్‌ను బట్టి ఎక్కువమంది దీపావళి రోజున ఎటు వెళ్లకుండా ఇంట్లోనో ఉండి ఓటీటీలో మూవీస్ ఎంజాయ్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.