గోవా అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్, భాజపా మధ్య హోరాహోరీ పోటీ నెలకొనడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను చూస్తే భాజపా 16, కాంగ్రెస్ 11, టీఎంసీ 4, ఆప్ 4, స్వతంత్రులు 1 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మొత్తం 40 స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు సాధించాల్సిన అవసరం ఉంది. కాని ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కేలా లేకపోవడంతో స్వంత్రత అభ్యర్థులను కలుపుకోని అధికారంలోకి రావాలని భాజపా, కాంగ్రెస్ భావిస్తున్నాయి. గోవాలో ప్రస్తుత పరిస్థితులు క్యాంపు రాజకీయాలకు దారితీశాయి.