ప్రముఖ దిగ్గజ నటుడు కృష్ణ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన తనదైన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్లు సృష్టించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సోదరుడు, తల్లిని కోల్పోయి దుఃఖంలో ఉన్న సోదరుడు మహేశ్ బాబుకి కష్టకాలంలో దేవుడు తోడుండాలని ప్రార్థించారు.
మహేశ్ బాబుకు దేవుడు తోడుండాలి:బాలకృష్ణ

screengrabfacebook:balakrishna