గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు సల్మాన్ ఖాన్ షూటింగ్లో పాల్గొన్నాడు. సల్మాన్ ఖాన్‌ను మెగాస్టార్ ఆహ్వానించారు. మెహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌కు రీమేక్. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.