ఈరోజు విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ చూసిన అభిమానులు సినిమాపై తమ అభిప్రాయాలను ట్విట్టర్లో పోస్టు చేస్తున్నారు. సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. చిరంజీవి తన విశ్వరూపం చూపించారు. స్వాగ్ నెక్ట్స్ లెవల్. ఫస్టాఫ్ చాలా క్రిస్పీగా ఉంది. ఎక్కడా అనవసరమైన సీన్లు లేవు. చిరంజీవి, సత్యదేవ్‌ల మధ్య నడిచే పొలిటికల్ డ్రామా ఆద్యంతం సూపర్‌గా ఉంది. థమన్ బీజీఎం మరో లెవల్‌కి తీసుకెళ్లిందట. ఇంటర్వెల్ సీన్లు అదిరిపోయాయి.సెకండాఫ్ బాగా డౌన్ ఉందని కామెంట్ చేస్తున్నారు. సల్మాన్ రోల్ నిరాశపరిచిందని చెబుతున్నారు. పూర్తి రివ్యూ కోసం మరి కొద్ది సేపు ఆగాల్సిందే.