రాజస్థాన్లో ఓ వృద్ధురాలి వింత ప్రవర్తన స్థానికంగా కలకలం రేపింది. దేవుడు తన కలలోకి వచ్చి.. మధ్యాహ్నం చనిపోబోతున్నావంటూ చెప్పాడని 90ఏళ్ల చిరోంజి దేవ్ వంతపాడింది. ఇంటి ముందున్న సమాధిలోకి వెళ్తున్నానని ప్రకటించడంతో స్థానికులంతా అంతిమ సంస్కారాలకు పూనుకొన్నారు. బట్టలు, గాజులు పెట్టారు. ఈ తతంగాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీనిపై అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని సదరు మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆమెకు చికిత్స అందిస్తున్నారు. నెలరోజులుగా నిద్రపోవట్లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.