గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే వార్త వచ్చేసింది.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ మూవీ గాడ్ ఫాదర్ రిలీజ్‌ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు తెలిపింది. గాడ్ ఫాదర్ చిత్రంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన నయనతార నటిస్తోంది. సత్యదేవ్, సునిల్ ఇతర క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version