నేడు, రేపు బయటికెళ్తున్నారా ? జాగ్రత్త !

© ANI Photo

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో నేడు, రేపు వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకపోవడం మంచిదని సూచించింది. అలాగే దక్షిణ తెలంగాణలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వివరించింది. రాష్ట్రంలో అత్యధికంగా కెరమెరి, చేప్రాల్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది.

Exit mobile version