సంక్రాంతికి ప్రజలు సొంతూళ్లకు వెళ్తుంటారు. హైదరాబాద్ మహానగరం ఏకంగా సగం ఖాళీ అవుతుంది. దీంతో దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉంది. అందుకే ఊరికి వెళ్లేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్‌లో పెట్టుకోవాలని చెప్పారు. రోడ్లపై వాహనాలు పార్క్ చేయవద్దని… ఇంటి ఆవరణలో లైట్ ఆన్ చేసి ఉంచాలని సూచించారు. ఆటోమేటిక్ డోర్ లాక్‌లు వినియోగిస్తే దొంగలు చోరీ చేసే ఆస్కారం తక్కువగా ఉంటుందని యోచన.