జావెలిన్ చాంపియన్ నీరజ్ చోప్రా శనివారం ఫిన్‌లాండ్‌లోని
కౌర్టెన్ గేమ్స్‌లో తన మొదటి ప్రయత్నంలోనే బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 86.69 మీటర్ల త్రో నమోదు చేసి ట్రినిడాడ్ మరియు టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్, గ్రెనడాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ కంటే ముందు నిలిచాడు. ఇక రెండో ప్రయత్నంలో ఫౌల్ అయిన నీరజ్ మూడోసారి కిందపడిపడోయాడు. దీంతో చివరి మూడు త్రోల నుంచి వైదొలిగాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఇది అతని తొలి టైటిల్. కౌర్టెన్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా నిలిచాడు.