కొత్త ఏడాదిలో 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మదుపుదారులు బంగారాన్ని స్థిరమైన పెట్టుబడిగా భావించడం, ఆర్థికమాంద్యం, అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు పెరగడం, క్రిఫ్టోలపై ఆసక్తి లేమి వంటివి బంగారం పెరగడానికి ప్రధాన కారణాలుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.54వేల వద్ద కొనసాగుతోంది.