తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్పల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పెరిగి రూ.51,400కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి 56,070కు ఎగబాకింది. అటు కిలో వెండి ధర రూ.74 వేల వద్ద కొనసాగుతోంది. రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా గోల్డ్‌కు డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.