తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. మూడు రోజుల్లో పుత్తడి ధర రూ.1000 మేర తగ్గింది. ఈరోజు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.100 తగ్గి రూ.50,900కు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.100 తగ్గి రూ.55,530కి పడిపోయింది. అటు కిలో వెండి ధర రూ.67,500 వద్ద ఉంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.