రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతుండడం, అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచే సమయం ఆసన్నమవడంతో బంగారంలో పెట్టిన పెట్టుబడులను మదుపర్లు ఉపసంహరించుకుంటున్నారు. దీంతో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,000లు ఉండగా, కిలో వెండి ధర రూ.69,600లుగా ఉంది. కాగా ఈనెల 8న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,100 ఉండగా, కిలో వెండి ధర రూ.72,900లుగా ఉంది. ఈ లెక్క ప్రకారం ఈ ఒక్క వారం రోజుల్లో బంగారం ధర రూ.2,100, కిలో వెండిపై రూ.3,300 తగ్గింది.