మూడు వారాలుగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెట్టాయి. త్వరలో పెళ్లిళ్ల సీజన్ మొదలు కాబోతున్న నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతుండడంతో ఆందోళన చెందిన ప్రజలకు గుడ్ న్యూస్ అందుతోంది. నిన్నటి మొన్నటి వరకు భారీగా పెరిగితే, వినియోగదారులకు ఊరట కలిగిస్తూ తాజాగా ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి నగరాలలో 22 క్యారెట్ల బంగారం రూ.500 తగ్గి రూ.47600 గా. 24 క్యారెట్ల బంగారం రూ.540 తగ్గి రూ.51,930 గా ఉంది. వెండి ధర కూడా కిలోకు రూ.1400 తగ్గి రూ. 72,800 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ. 48,190, 24 క్యారెట్ల బంగారం రూ. 52,750 గా ఉంది.