దేశంలోని వెర్వేరు ఎయిర్‌పోర్టుల్లో పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్ అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రూ.2 కోట్ల విలువైన బంగారాన్ని లోదుస్తుల్లో తరలిస్తున్న ప్రయాణికున్ని కస్టమ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో రూ.85 లక్షల విలువైన గోల్డ్‌ను తీసుకెళ్తున్న దుబాయి ప్రయాణికున్ని అరెస్ట్ చేశారు. మరోవైపు కోల్‌కతాలో అక్రమంగా తరలిస్తున్న రూ.80 లక్షలు ఖరీదైన బంగారాన్ని సీజ్ చేశారు. అదుపులో ఉన్న ముగ్గురు నిందితులు దుబాయికి చెందినవారు కావడం గమనార్హం.