తెలంగాణ రాష్ట్రంలో మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి సీరియస్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో విఫలమైందని మండిపడ్డారు. మొన్న అమ్నీషియా, నిన్న సికింద్రాబాద్ ఇలా గత మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో 4 రేప్ కేసులు నమోదయ్యాయని, రాష్ట్రంలోని పసికందుకు కూడా రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీలకు రక్షణ లేని రాష్ట్రంగా మార్చడమేనా బంగారు తెలంగాణ అంటే అని నిలదీశారు. అటు మైనర్ బాలిక ఫోటోలు విడుదల చేసిన ఎమ్మెల్యే రఘునందన్ దోషి అంటూ ఆరోపించారు.