ఏపీ రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థుల హాల్ టికెట్లను వెబ్సైట్ లో ఉంచినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలియజేశారు. ఇంటర్ ఆర్ఐవో వెంకట రెడ్డి మాట్లాడుతూ.. హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కళాశాల ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. సంతకం లేదని విద్యార్థులను పరీక్షలకు అనుమతించని కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.