హుస్సేన్ సాగర్ పర్యాటకులకు శుభవార్త

© File Photo

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ రూ.45.37 కోట్ల నిధులు మంజూరు చేసింది. వీటితో మల్టీమీడియా లేజర్ షో‌తో పాటు, మ్యూజిక్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేయనున్నారు. సంజీవయ్య పార్క్ పక్కనే ఆధునిక పరిజ్ఞానంతో ఈ ఫౌంటెయిన్ నిర్మించడానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. అలాగే ఓయూలోని ఆర్ట్స్ కళాశాల భవన సముదాయాన్ని తీర్చిదిద్దేందుకు రూ.11.85 కోట్లు విడుదల చేసింది.

Exit mobile version