టీఎస్ ఆర్టీసీ తమ ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. తొలి విడతగా ప్రయోగాత్మకంగా 16 బస్సులను కొనాలని టెండర్లు పిలవగా అశోక్ లేలాండ్ కంపెనీ దక్కించుకుంది. బస్సులు చేతికి రావటానికి దాదాపుగా సిద్దమయ్యాయి. కాగా ఈ బస్సులను హైదరాబాద్ కేంద్రంగా బెంగళూరు, వైజాగ్, ముంబై, చెన్నై, ఒంగోలు, విజయవాడ, తిరుపతి, ఏలూరు తదితర ప్రాంతాలకు తిప్పనున్నారు. బస్సులకు ఆదరణ ఉంటే మరికొన్నింటికి ఆర్డర్ ఇవ్వనున్నారు.