నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఉగాదిని పురష్కరించుకొని శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ధిక శాఖ ఆమోదించిన గ్రూప్-1 నోటిఫికేషన్ను ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకొని విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులు ఉండగా.. మెగా ఉద్యోగాల భర్తీ మేళాను ఈ నోటిఫికేషన్తోనే ప్రారంభిస్తారట.