చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్(CMRL)లో 19 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనుండగా.. వివిధ విభాగాల్లో ఈ పోస్టుల భర్తీ జరగనుంది. పోస్టులను బట్టి ఉద్యోగార్హత ఉండగా.. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుండగా.. ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000 నుంచి రూ.2,50,000 వరకు జీతం చెల్లించనున్నారు.