వాట్సాప్లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ రానే వచ్చింది. ఇప్పటిదాకా వాట్సాప్లో కేవలం 100MB డేటా మాత్రమే షేర్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో పెద్ద పెద్ద ఫైల్స్ పంపుకునేందుకు చాలామంది టెలిగ్రామ్ వంటి ఇతర మెసెంజర్ యాప్లను వాడుతున్నారు. దీనిపై దృష్టిసారించిన వాట్సాప్ ఇక 2GBవరకు షేర్ చేసుకునే వెసులుబాటును కల్పించబోతోంది. ప్రస్తుతం పలు దేశాల్లో ఈ ఫీచర్ టెస్టింగ్ కొనసాగుతుండగా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.