ఇన్‌స్టాగ్రాం, ఫేసుబుక్, మెసెంజర్ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాల మాతృసంస్థ మెటా గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వివిధ రకాల అకౌంట్ల పాస్‌వర్డ్‌లు, అడ్వర్టయిజ్‌మెంట్లపై కంట్రోల్ ఇవ్వనుంది. ఇందుకోసం కొత్తగా అకౌంట్ సెంటర్‌ను ప్రవేశపెడుతోంది. అకౌంట్ సెంటర్ ద్వారా వ్యక్తిగత విషాలు, పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ, యాడ్ ప్రిఫరెన్స్‌లు ఇలా అన్నింటినీ మేనేజ్ చేసుకోవచ్చు. ప్రతీ యాప్‌లో వేర్వేరుగా కాకుండా యాప్ సెంటర్‌లో మార్చుకోవడం ద్వారా అన్నింటికీ వర్తింపజేసుకోవచ్చు.