యంగ్ హీరో నాని కథానాయకుడిగా తెరకెక్కిన ‘దసరా’ చిత్రం ట్రైలర్ ఈ నెల 14న విడుదల కానుంది. మెుత్తం ఐదు భాషల్లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ చిత్రం మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దసరా మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇందులో నానికి జోడిగా కీర్తి సురేష్ నటించారు. నాని లుక్స్ బట్టి మాస్ ఆడియన్స్‌కు ఈ సినిమా పండగే అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.