రష్యా సైనిక దాడిలో అల్లాడిపోతున్న ఉక్రెయిన్ కు సహాయక చర్యల కోసం టెక్ దిగ్గజం గూగుల్ $15 మిలియన్ డాలర్ల ను ప్రకటించింది. $5 మిలియన్ డాలర్లను ఉద్యోగుల నుంచి, డైరెక్ట్ గ్రాంట్ల ద్వారా $5 మిలియన్ డాలర్లు, అడ్వర్టైజింగ్ క్రెడిట్ల నుంచి మరో $5 మిలియన్ డాలర్లను సేకరించనున్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్ పై రష్యా దాడిని మానవతా విపత్తుగా పేర్కొంటూ ఆ సంస్థ గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ కెంట్ వాకర్ తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు.