గూగుల్ మీట్‌ను యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు వీలుగా గూగుల్ మీట్‌కు కొత్త ఫీచర్‌ను యాడ్ చేసింది. మీట్ యాప్‌లో మీటింగ్‌కు సంబంధించిన యాక్టివిట్‌స్ ప్యానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం అడ్మిన్‌కు ఉంటుంది. యూజర్లు కూడా తమ ఛానల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. సంస్థ వెలుపల ఉన్నవారికి సమాచారాన్ని అందించాలనుకునే సందర్భాల్లో లైవ్ స్ట్రీమింగ్ ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్ చెప్తుంది. మీటింగ్‌ను పాజ్ చేయడానికి, రీప్లే చేయడానికి లేదా తర్వాత వీక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ను దశలవారిగ అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ ప్రకటించింది.