ప్రముఖ సెర్చింజిన్ సంస్థ గూగుల్ (Google) త్వరలోనే సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. టెక్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెల్ వాచ్-2 (Google Pixel Watch 2) లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 4న జరగనున్న గూగుల్ పిక్సెల్ ఈవెంట్ (Google Pixel event 2023)లో ఈ వాచ్ ప్రపంచం ముందుకు రానుంది. గతేడాది అక్టోబర్‌లో రిలీజ్ చేసిన గూగుల్ పిక్సెల్ వాచ్ (Google Pixel Watch)కు అనుసంధానంగా దీన్ని తీసుకొస్తున్నారు. ఈ నయా వాచ్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వాచ్ డిజైన్
పిక్సెల్ వాచ్ 2.. ఫస్ట్ జనరేషన్ మోడల్‌ను పోలి ఉండనుంది. రైట్ సైడ్‌లో రౌండ్ బెజెల్ లెస్ డిస్‌ప్లే, మెటల్ క్రౌన్ ఉన్నాయి. ఈ గ్యాడ్జెట్‌ను 100 శాతం అల్యుమీనియంతో తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈ వాచ్ డిస్‌ప్లే 384×384 resolutionను కలిగి ఉన్నట్లు సమాచారం.
అడ్వాన్స్‌డ్ ప్రొసెసర్
ఈ వాచ్ Qualcomm SW5100 SoC ప్రొసెసర్‌తో పనిచేయనున్నట్లు సమాచారం. Snapdragon W5 chipsetతో ఇది వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఇది 2GB RAM కూడా కలిగి ఉన్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
బ్యాటరీ లైఫ్
ఈ గూగుల్ పిక్సెల్ వాచ్ 2ను 306 mAh batteryతో తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ వాచ్‌కు 24 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుందట. 75 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చని లీక్స్ చెబుతున్నాయి. Android 13-based Wear OS 4తో ఈ వాచ్ రాబోతున్నట్లు సమాచారం. అక్టోబర్ 4న దీనిపై స్పష్టత రానుంది.
స్ట్రెస్‌ను గుర్తించే సెన్సార్
ఇక ఈ స్మార్ట్‌వాచ్‌లో ఫిట్బిట్కి చెందిన మల్టీ పాత్ హార్ట్‌రేట్ సెన్సార్, స్ట్రెస్ మేనేజ్మెంట్ సిస్టెమ్ వంటివి ఉండనున్నాయి. వీటితో వ్యాయామాలను, స్ట్రెస్‌తో బాడీలో కనిపించే మార్పులను ఈ వాచ్ రికార్డ్ చేస్తుందట.
అడ్వాన్స్‌డ్ ఫీచర్లు
పిక్సెల్ వాచ్ 2లో అనేక హెల్త్, ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్స్, ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్, హార్ట్ జోన్ ట్రైనింగ్, ఎమర్జెన్సీ సర్వీసెస్ సమయంలో మెడికల్ డేటాను షేర్ చేసుకోవటం వంటి ఫీచర్లు ఉన్నట్లు తెలిసింది.
కలర్స్
Google Pixel Watch 2.. పాలిష్డ్ సిల్వర్/బే, మాట్ బ్లాక్/ ఓబ్సీడియన్, షాంపైన్ గోల్డ్/ హాజెల్, పాలిష్డ్ సిల్వర్/ పోర్సెలిన్ వంటి రంగుల్లో ఈ గూగుల్ పిక్సెల్ వాచ్ 2 అందుబాటులో ఉండనుంది.
ధర ఎంతంటే?
పిక్సెల్ వాచ్ 2 ధరను గూగుల్ అధికారికంగా ప్రకటించలేదు. అక్టోబర్ 4న జరిగే పిక్సెల్ ఈవెంట్‌లోనే ధరపై క్లారిటీ రానుంది. అయితే భారత్‌లో ఈ వాచ్ ధర రూ.35,999గా ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.