ఈ ఫోన్లలో గూగుల్‌ సేవలు బంద్‌

© Envato

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్‌ సేవలపై సంస్థ కీలక ప్రకటన చేసింది. 1Gb ర్యామ్‌తో పనిచేస్తున్న ఫోన్లలో ఇకపై గూగుల్‌ మొబైల్‌ సర్వీసెస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ ర్యామ్‌ ఫోన్ల కోసం తీసుకొచ్చిన ‘ఆండ్రాయిడ్ గో’ OS కూడా ఇకపై 1జీబీ ర్యామ్‌ ఫోన్లలో పనిచేయదు. ఇకపై ఆండ్రాయిడ్‌ గో ఓఎస్‌ పనిచేయాలంటే 2 జీబీ ర్యామ్‌/ 16 జీబీ మెమొరీ తప్పనిసరిగా ఉండాలి. గూగుల్ త్వరలో ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ 13తో పాటు ఆండ్రాయిడ్ 13 గో వెర్షన్‌ను కూడా తీసుకురానుంది. భద్రత, గోప్యత పరంగా ఈ ఓఎస్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

Exit mobile version